చెరువులలో కనీసం కంటే తక్కువ నీరు…..

చెరువులలో కనీసం కంటే తక్కువ నీరు…..

రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్న రైతులు, స్థానికులు….

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని కొనకంచి గ్రామంలోని చెరువు నుండి కనీసం కంటే తక్కువ నీరు ఉండే విధంగా నీటిని బయటకు పంపుతున్న చెరువుపాట నిర్వాహకులు. చెరువులో కనీస నీరు లేకుంటే ఎలా సమీప గ్రామాల్లోని పశువులకు నీరు మేత కూడా దొరకదని గ్రామస్తులు వాపోతున్నారు.

చేపల పట్టుకునేందుకు చెరువులో నీటి మొత్తాన్ని దిగువ ప్రాంతాలకు వదిలివేయడంతో సమీప గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి మండలంలో ఉన్న అన్ని చెరువుల వద్ద తగిన రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు స్థానికులు కోరుతున్నారు.