తిర్యాని పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ…

తిర్యాని పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ…
అసాంఘిక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాలి
పోలీస్ అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ
తిర్యాని, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ శనివారం రోజున తిర్యాని పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు. ఎస్‌హెచ్‌ఓ వెంకటేష్ కు, స్టేషన్ సిబ్బందికి, ఎస్పీ పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు సిబ్బందీ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో చట్టవ్యతిరేకచర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. మండల కేంద్రంలో, గ్రామాల్లో ప్రజలు వ్యాపారస్తులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా కృషి చేయాలని అన్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదిదారుడితో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.
మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, శాంతి భద్రతల విషయంలో రాత్రిపూట పర్యవేక్షణ,పెట్రోలింగ్‌ను కచ్చితంగా కొనసాగించాలని సూచించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
