విజేతలను అభినందించిన కలెక్టర్…

విజేతలను అభినందించిన కలెక్టర్…

  • మట్టిలో మాణిక్యం అంటే ఇలా ఉండాలి జిల్లా కలెక్టర్

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : సీఎం కప్ క్రీడలను అభినందించిన జిల్లా కలెక్టర్ భీమ్‌గల్‌ మండలం రూప్ల తండాకు చెందిన భుక్య అశ్విని రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అభినందించిన జిల్లా కలెక్టర్ ఇటీవల తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ఎడిషన్ సీఎం కప్ 2025-26 పోటీలలో హాకీ విభాగంలో పాల్గొన్న భుక్య అశ్విని రెండవ స్థానం (సెకండ్ ప్రైజ్)సాధించి జిల్లా గర్వంగా నిలిచారు.భుక్య అశ్విని, బాల్కొండ మైనారిటీ స్కూల్ ఆరో తరగతి చదువుతున్న భుక్య వినోద్ కుమార్తె, ఈ పోటీలు హైదరాబాద్‌ లో నిర్వహించబడగా, అండర్-13 విభాగంలో ఆమె అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారు.

ఈ విజయంతో గ్రామ సర్పంచ్ భూక్యా సర్ధార్, ఉప సర్పంచ్ బోడ అరణ్, కుటుంబ సభ్యులు, కోచ్‌లు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో విజయాలు సాధించాలని కొనిఆడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, వివిధ శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a Reply