Peddapalli Rural | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కళ సాకారం

Peddapalli Rural | ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కళ సాకారం

  • అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు
  • ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
  • పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

Peddapalli Rural | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కళ సాకారం అవుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణం రంగంపల్లి 10, 11 వార్డుల్లో అర్హులైన 36మంది ఇందిరమ్మ ఇళ్ల నూతన నిర్మాణాలకు ఎమ్మెల్యే విజయ రమణారావు ముగ్గులు పోసి భూమిపూజ అనంతరం ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు 400 ఎస్ఎఫ్టి తగ్గకుండా 600 ఎస్ఎఫ్టి పెరగకుండా చూసుకోవాలని లబ్దిదారులకు సూచించారు. గత పాలకులు పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని, ఎన్నికల సమయాల్లో హామీలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేయకుండా పబ్బం గడిపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. పెద్దపల్లి పట్టణంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పట్టణం సుందరంగా మారుతుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, మున్సిపల్ అధికారులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, రంగంపల్లి ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply