పంది దాడిలో గొర్ల కాపరికి తీవ్రగాయాలు

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన గొర్ల కాపరి పెంకర్ల మల్లేష్ పై సోమవారం మధ్యాహ్నం అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గొర్రెలను మేపేందుకు అడవి పక్కకు వెళ్లిన అతనిపై ఒక్కసారిగా అడవి పంది దాడి చేయగా,కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొంతమంది రావడంతో అడవి పంది పారిపోయిందని బాధితుడు చెప్పారు.ఈ దాడిలో మల్లేష్ కుడి కాలు తొడపై తీవ్రంగా గాయాలయ్యాయని, వెంటనే అతన్ని జన్నారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించి చికిత్స చేయించారు. తీవ్రగాయాల గురైన మల్లేష్ కు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని అటవీ అధికారులను ఆ గ్రామ సర్పంచి పంజాల సురేష్ గౌడ్ కోరారు.

