అంబాపురంలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

విజయవాడ రూరల్ (వెస్ట్) (ఆంధ్రప్రభ): మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో వైఎస్సార్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నల్లమోతు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నల్లమోతు చంద్రశేఖర్ మాట్లాడుతూ, పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ పాలన సాగిందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తోడేటి కిరణ్ కుమార్, దొండపాటి షడ్రక్, మంచాల విజయ్, మందా రమేష్, కొడాలి ప్రవీణ్, జిల్లా కుమార్, కుందేటి విజయ్, పచిగళ్ల అజాద్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.