Harish Rao | ఫ్రూట్ మార్కెట్‌పై భూ బకాసురుల కన్ను
Harish Rao | ఫ్రూట్ మార్కెట్‌పై భూ బకాసురుల కన్ను
అమ్మేందుకు కుట్రలు :హరీశ్
Harish Rao | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రంగారెడ్డి జిల్లా కోహెడ్ పండ్ల మార్కెట్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కోహెడ్ మార్కెట్ స్థలాన్ని అమ్మేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. భూ బకాసురుల కన్ను ఫ్రూట్ మార్కెట్‌పై పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళారుల కోసం పని చేస్తోందని హరీశ్ విమర్శించారు.
ఇక్కడికి రాజకీయాల కోసం కాదు.. రైతుల కోసం వచ్చానని చెప్పారు. మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని అన్నీ సమకూర్చామని, రైతులకు రూ.కోట్లు చెల్లించి భూములు సేకరించామని, లక్షల మంది రైతుల భవిష్యత్ కోసం పోరాడుతున్నామని చెప్పారు. 170 ఎకరాల్లో కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసే దాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మార్కెట్ కోసం కేసీఆర్ ఇచ్చిన స్థలాన్ని డెవలప్మెంట్కు ఇవ్వడమేమిటని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల మార్కెట్ స్థలాన్ని ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు
