ఘనంగా బాల జన్మదిన వేడుకలు..

ఘనంగా బాల జన్మదిన వేడుకలు..

  • శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వసంత

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : బీజేపీ సీనియర్ నాయకుడు నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) 50వ జన్మదిన వేడుకలు స్థానిక ఎంవీఆర్ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మైలవరం శాసన సభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరై బాలాను దుశ్శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేయించి తినిపించారు.

బాల నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వసంత ప్రారంభించారు. పలువురు కూటమి నాయకులు, ప్రముఖులు, స్నేహితులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply