విద్యకు వయసు, పదవులు అడ్డంకి కాదు..

విద్యకు వయసు, పదవులు అడ్డంకి కాదు..

ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసిన చైర్ పర్సన్ లు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : విద్యకు వయసు పదవులు అడ్డం కి రాదని నిరూపించారు ఇంద్రవెల్లి మండలానికి ఇంద్రవెల్లి,ధనోరా పాఠశాలల విద్యా కమిటీ చైర్పర్సన్లు మనిషా, మంజుషాలు, అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని జెడ్ పి ఎస్ ఎస్ ఓపెన్ స్కూల్ పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల్లో వారు పరీక్షలు రాశారు. విద్యపై ఆసక్తితో పదో తరగతి పరీక్షలు రాయడం విశేషం మంగళవారం పుత్తూరులో జరిగిన ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో వారు పరీక్షలు రాశారని ఓపెన్ స్కూల్ పరీక్షల సెంటర్ సీఎస్ చవాన్ సీతల్ డిఓ కృష్ణ తెలిపారు.

ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షల్లో వారు పరీక్షలు రాస్తున్న విషయం తెలుసుకొని ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవులు ఉన్న పరీక్షలు రాయడం ఆదర్శనీయమని స్ఫూర్తి అనివారు అన్నారు. రెండవ రోజు పరీక్ష కేంద్రాన్ని డిఓ కృష్ణ, కోఆర్డినేటర్ అశోక్ కుమార్ తనిఖీ చేయగా ఈ విషయం తెలుసుకొని ఆయన అభినందించారు.

సమాజంలో విద్యకు ఉన్న ప్రధాని అతను గుర్తించి పదవులను పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు విద్యపై ఆసక్తితో పరీక్షలు రాయడం ఎంతో సంతోషకరమని వారు అన్నారు. వారి సంకల్పంతో పరీక్షలు రాయడం అభినందనీయమని పరీక్షలు విజయవంతం చేసి అందరికీ స్ఫూర్తిగా విద్యపై ఆసక్తి పెరిగే విధంగా మహిళలు ముందుకు రావడం ఎంతో సంతోషకరమని వారితో పాటు పరీక్ష కేంద్ర సిఎస్ చవాన్ సీతల్ పేర్కొన్నారు.

Leave a Reply