అకాల వర్షం.. నేలరాలిన మామిడి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం ఈదురు గాలులు అకాల వర్షానికి మామిడికాయలు నేలరాలిన విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రభదినపత్రికలో వార్త కథనం ప్రచురితం కావడంతో బాధితరైతుకనకల్ రోషినిప్ప పొలంలో నేలరాలిన మామిడి పంటను ఆర్టికల్చర్ అధికారి జనార్ధన్ శుక్రవారంపరిశీలించారు. అకాల వర్షం ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిన సంఘటనపై విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నట్లు ఆర్టికల్చర్ అధికారి జనార్ధన్ విలేకరులకు తెలిపారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలనిపలువురు కోరుతున్నారు.