ఇసుక తరలింపును అడ్డుకున్న వెంకటాపూర్ గ్రామస్తులు..
వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ శుక్రవారం తమ గ్రామ వనరులైన ఇసుక తమకే చెందాలని ఇతర గ్రామాలు మ గ్రామం నుండి ఇసుక తరలింపు చెయ్యొద్దని గ్రామ రైతులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి. అటు నుండి నేరుగా భారీ ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేసి అనంతరం కులాలకు వారీగా రైతులు కలసి వినతి పత్రం తహసిల్దార్ అనిరుద్ కు అందజేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ అనిరుద్ మాట్లాడుతూ.. వెంకటాపూర్ గ్రామ ఇసుక వినియోగ విషయమై జిల్లా కలెక్టర్ కు ఇసుక వాడక విషయమై వెంకటాపూర్ గ్రామ రైతుల సమాచారాన్ని సమస్యలని కలెక్టర్ కి చేరవేసి సమస్య పైన పరిష్కారము చేయుటకు కొంత సమయం కావాలని వెంకటాపూర్ గ్రామస్తులు రైతులతో కోరారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగావెంకటాపూర్ వనరు అయిన ఇసుకను తమ గ్రామాల నుండి ఇతర గ్రామాలకు ఇసుకను తీసుకువెళ్ల వద్దని భూగర్భ జలాలు తీవ్రమైన కరువు ఏర్పడుతుందని సాగునీరు తాగునీరు పశువులకు తీవ్రమైనటువంటి నీటి కొరత ఏర్పడడం చేత గ్రామస్తులకు రైతులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడటం చేత కచ్చితంగా ఇట్టి ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ తహసిల్దార్ కులాల వారీగా కలసి మెమోరండం. అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ రైతులు సంఘాలు గ్రామస్తు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..
