Nutrition | భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు…
Nutrition | భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు…
Nutrition | శావల్యాపురం, ఆంధ్రప్రభ : భూసార పరీక్షలతో భూమిలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని అధిగమించడం ద్వారా మనకు అధిక దిగుబడులు వస్తాయని హార్టికల్చర్ అసిస్టెంట్ జంపాల ప్రసాద్ అన్నారు. రైతులు పంటలు సాగుచేసే ముందు భూమిలో పోషక లోపాలు గుర్తించాలన్నారు. శావల్యాపురం మండలం కారుమంచి పొలాల్లో ఈ రోజున వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కలసి భూసార పరీక్షల కోసం మట్టి సేకరణ చేశారు.
సేకరించిన మట్టిని ల్యాబ్ పరీక్షలకు పంపించి లోపాలు గుర్తించడం జరుగుతుందన్నారు. గుర్తించిన పోషక లోపాలను తర్వాత రైతులకు తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఓర్సు లక్ష్మీ దుర్గ, సిబ్బంది చుండూరి నాగమణి, బ్రాహ్మేశ్వరి, శివపార్వతి, రామాంజమ్మ, వరప్రసాద్ పాల్గొన్నారు.
