number1cm | తమిళనాడులో మార్పు రాజకీయాలకు కొత్త దిశ

number1cm | తమిళనాడులో మార్పు రాజకీయాలకు కొత్త దిశ

number1cm | వెండి తెర నుంచి సీఎం కుర్చీ వరకు విజయ్ ప్రయాణం
వారసత్వ రాజకీయాలకు సవాల్‌గా ఎదిగిన విజయ్
అవినీతిపై యుద్ధం ప్రకటించిన తమిళనాడు సీఎం
ప్రజలనే భాగస్వాములను చేస్తున్న విజయ్ ప్రభుత్వం
‘ఒకేఒక్కడు’ సినిమాను గుర్తు చేస్తున్న విజయ్ పాలన
రాజకీయ లాభనష్టాల కంటే ప్రజా నమ్మకానికే ప్రాధాన్యం
చరిత్రలో నిలిచే నాయకుడిగా మారుతాడా విజయ్?

number1cm | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వెండి తెరపై హీరోగా కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన విజయ్… ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా అదే వేగంతో దూసుకెళ్తున్నారు.
సినిమాల్లో అన్యాయానికి ఎదురు నిలిచే పాత్రలు పోషించిన ఆయన… నిజజీవిత రాజకీయాల్లో కూడా అదే ధోరణితో ముందుకు సాగుతుండటమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

number1cm
number1cm

తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ, వారసత్వ రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా కుదిపేసిన తుఫాన్‌లా విజయ్ ఎదిగారు.
ఎన్నికల సమయంలో ఆయన సభలకు తరలివచ్చిన జనసందోహం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
అది కేవలం ఒక సినీనటుడిపై అభిమానమా…?
లేక మార్పు కోసం ప్రజల్లో పెరిగిన ఆకాంక్షా…?
అనే ప్రశ్నలకు సమాధానం ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది.

అఖండ విజయంతో అధికారంలోకి వచ్చినప్పటికీ… సంఖ్యాబలం విషయంలో కొన్ని రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి.
కానీ వాటన్నింటినీ అధిగమించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విజయ్… అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజారంజక పాలనకు శ్రీకారం చుట్టడం విశేషంగా మారింది.

అక్కడి నుంచే అసలు కథ మొదలైంది.

విజయ్ హావభావాలు, మాట్లాడే తీరు, ప్రజలతో మమేకమయ్యే విధానం చూస్తుంటే… చాలామందికి దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఒకేఒక్కడు సినిమా గుర్తుకొస్తోంది.
ఒక్కరోజు ముఖ్యమంత్రిగా వ్యవస్థను కుదిపేసిన అర్జున్ పాత్రను… ఇప్పుడు నిజజీవితంలో విజయ్ గుర్తు చేస్తున్నాడనే చర్చలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా తమిళనాడులో సంవత్సరాలుగా వేళ్లూనుకుపోయిన అవినీతిపై విజయ్ ప్రకటించిన యుద్ధం ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది.
“ఎవరు లంచం అడిగినా వెంటనే ఫిర్యాదు చేయండి” అంటూ ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం…
ధైర్యంగా అవినీతిపరులను పట్టించిన వారికి లక్ష రూపాయల బహుమతి ప్రకటించడం…
ప్రజలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయడం… ఇవన్నీ సాధారణ రాజకీయ ప్రకటనల్లా కనిపించడం లేదు.
వ్యవస్థను లోపల్నుంచే మార్చాలనే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి.

గత పాలకులు పెద్దగా పట్టించుకోని సమస్యను చేతిలోకి తీసుకుని… రాజకీయ లాభనష్టాల కంటే ప్రజల నమ్మకాన్ని ముఖ్యం చేస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కాకుండా… అవినీతిని వేరుతో సహా పెకిలించాలనే సంకల్పం చూపించడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది.

ఇప్పుడు ప్రజల్లో ఒక్కటే చర్చ…

ఈ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చి…
వ్యవస్థను నిజంగానే గాడిలో పెట్టి…
రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా మార్చుకుంటూ ముందుకు తీసుకెళ్తే…
చరిత్రలో నిలిచిపోయే నాయకుడిగా విజయ్ మారుతాడా…?

అనే ఆసక్తి తమిళనాడులోనే కాదు… దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.

అధికారుల అలసత్వాన్ని, బాధ్యతారాహిత్యాన్ని సహించకుండా తక్షణ చర్యలతో పరిపాలనలొ సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నరు విజయ్

click here to read more

click here to read tn chief minister | వారికి రూ.లక్ష రివార్డ్