30 people | డ్రైవర్ అప్రమత్తతతో…

30 people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పినపాక బ్రిడ్జిపై భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఖమ్మం వైపు వెళ్తున్న బస్సు ముందు భాగంలోని యాక్సిల్ ఒక్కసారిగా విరిగిపోవడంతో ముందు టైరు ఊడిపోయింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును అదుపులోకి తీసుకుని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం కారణంగా పినపాక బ్రిడ్జిపై సత్తుపల్లి, భద్రాచలం, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.