Ayesha Meera | సంస్మరణ దినోత్సవం నిర్వహించాలి

Ayesha Meera | సంస్మరణ దినోత్సవం నిర్వహించాలి
మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజను కలిసిన
ఆయేషా మీరా తల్లిదండ్రులు
Ayesha Meera | మంగళగిరి, ఆంధ్రప్రభ : మంగళగిరి చినకాకానిలోని మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజను ఆయేషా మీరా (Ayesha Meera) తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా మాట్లాడుతూ…. తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి, డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం (obituary day) నిర్వహించాలని ఆమె తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ను కోరారు. మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను ఈరోజు వారు కలిసి ఒక వినతి పత్రం అందజేశారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా (Ayesha Meera) హత్య కేసుకు ఈరోజుతో 18 ఏళ్ళు పూర్తయ్యాయన్నారు. ఇన్నేళ్లైనా, ఈ కేసులో నిందితుడిని కనిపెట్టలేకపోవడం బాధాకరమైన విషయమన్నారు. పోలీసులు, సిట్, సీబీఐ లాంటి ధర్యాప్తు సంస్థలన్నీ ఏం చెయ్యలేక చేతులు ఎత్తేశారు. ఇది అత్యంత దారుణమన్నారు.
అమాయకుడు విడుదల కావడమే కాదు, అసలు నేరస్తులకు శిక్ష పడాలన్నదే మా డిమాండ్ అని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, బాషా అన్నారు. మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతుతో న్యాయ పోరాటం చేస్తున్నాం.. 2018లో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు (CBI investigation) ప్రారంభమైంది.. రాజకీయ నాయకుల కుటుంబాలకు చెందిన కీలక సాక్ష్యాలు మాయమయ్యాయి.. నేరస్థులను కాపాడేందుకు ప్రయత్నించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
