​భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతల పూజలు..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ దేవతల పూజలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ వేడుకల్లో ఊరి ప్రజలంతా ఒకతాటిపైకి వచ్చి, తమ గ్రామం చల్లగా ఉండాలని, పంటలు బాగా పండాలని ఆ బంధన దేవతలను వేడుకున్నారు.
గ్రామ పొలిమేరల్లో దుష్ట శక్తులు రాకుండా, కలరా, మలేరియా , అలాగే గ్రామంలోని పశుపక్ష్యాదులు, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ గ్రామ దేవతల పూజలు నిర్వహించారు.