తాడేపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ 103 వ జయంతి

తాడేపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ 103జయంతి

ఘంటసాల, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా ఘంటసాల మండలం తాడేపల్లి గ్రామంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుతగా ఘంటసాల మండల టీడీపీ అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, టీడీపీ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోసులు పార్టీ జెండాని ఆవిష్కరించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా తుమ్మల చౌదరి బాబు మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు తన నటనతో ప్రజలకు ఒక రాముడులా, కృష్ణుడిగా ఎన్నో పాత్రలు పోషించే ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన ఘనత ఒక ఎన్టీఆర్కే దక్కిందన్నారు. రాజకీయ రంగంలోకి 1982లో ప్రవేశించి తెలుగుదేశంపార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఎన్టీఆర్ కి సాధ్యమైందన్నారు. ప్రజల కష్టాలను గుర్తించి వారు పడుతున్న ఇబ్బందులను చూసి రోజుల్లో కిలో బియ్యం రెండు రూపాయలకే అందించి ప్రజల్లో మరింత ఆదరణ సాధించారు. ఎన్టీరామారావు ఒక నిర్దిష్ట లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భావించి పేద ప్రజలను అన్ని విధాల ఆదుకున్నారని అందుకే ఆయన ప్రజలు హృదయాలలో తిరుగులేని నాయకుడిగా గుర్తుండిపోయాడన్నారు.

ఈ కార్యక్రమంలో తాడేపల్లి గ్రామ మాజీ ఉపసర్పంచి కొడాలి లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు యార్లగడ్డ వీరభద్రరావు, సూరపనేని శివరాం ప్రసాద్, వడ్లమూడి కోటేశ్వరరావు, వెంకటరామయ్య, సూరపనేని వెంకట్రావు, మైనేని మధుసూదన్ రావు, పెదపూడి నాగమల్లి కుమారస్వామి, దోనేపూడి కోటేశ్వరరావు, మొవ్వ ప్రసాదు, వీరయ్య, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున హాజరై నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు.

Leave a Reply