ఘనంగా బక్రీద్ వేడుకలు..

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ ; త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచే ముస్లింల పవిత్ర పండుగ ‘బక్రీద్’ (ఈద్-ఉల్-అజ్హా) వేడుకలు కరీంనగర్ నగరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో , ఘనంగా జరిగాయి. గురువారం కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని ప్రధాన ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తో పాటు వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం సీపీ గౌష్ ఆలం ముస్లిం సోదరులందరికీ ఆలింగనం చేసుకుని, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ పండుగ సమాజంలో శాంతి, సోదరభావం, కరుణను మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలో పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ తరఫున అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కు ఈద్గా వద్ద విధుల్లో ఉన్న ట్రైనీ ఐపిఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ కుమార్, కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
