NEWS@ 05:00 P.M | 8 జూలై 2026 ముఖ్యాంశాలు

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోగా, క్యూలైన్ శిలాతోరణం వరకు విస్తరించింది. సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఒక్కరోజే 80,706 మంది శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.86 కోట్లు నమోదైంది. click here to read full news


——————————————————————————–


వీడియో కాల్‌లో పరామర్శించిన సోనూసూద్

పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబాన్ని సోనూసూద్ వీడియో కాల్‌లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన మానవత్వంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. click here to read full news

——————————————————————————–


రేవంత్, ఉత్తమ్‌ను ఉరి వేసినా తప్పులేదు. : హరీష్

గోదావరి జలాల వినియోగంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్ఎస్ నేత ఆరోపించారు. దేవాదుల మోటార్లు ఎందుకు నడపడం లేదని ప్రశ్నిస్తూ, తెలంగాణ నీటిని ఏపీకి మళ్లిస్తున్నారని విమర్శించారు. click here to read full news

——————————————————————————–


నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ ఆవేదన

హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, “నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు click here to read full news

——————————————————————————–


1,700 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలతో మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు చేపట్టడంతో కీలక సూచీలు కుప్పకూలాయి. click here to read full news

——————————————————————————-


ఇరాన్‌తో ఇక ఒప్పందం లేదు..

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నౌకలపై దాడులతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించారు. ఇక చర్చలకు అవకాశం లేదని స్పష్టం చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. click here to read full news

——————————————————————————-


20 మంది విద్యార్థులకు అస్వస్థత

రిమ్స్ డెంటల్ కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం. కలుషిత ఆహారంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, అధికారులు విచారణ చేపట్టారు. click here to read full news

——————————————————————————-


ఈనెల 15లోపు పీఎఫ్ వడ్డీ జమ..

ఈపీఎఫ్‌వో కొత్త డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించింది. పీఎఫ్ ఖాతాదారులు రూ.5 లక్షల వరకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ ద్వారా పొందే అవకాశం. 2025-26 వడ్డీ 8.25 శాతం జమ చేయనుంది. click here to read full news

——————————————————————————-


వావ్​ తాడిచర్ల 2 బిగ్​ గిప్ట్​

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను కేంద్రం నేరుగా కేటాయించింది. 2020 తర్వాత వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థకు గని కేటాయించడం ఇదే తొలిసారి. కిషన్ రెడ్డి ఆమోదించారు. click here to read full news

——————————————————————————-


హెచ్‌ఎల్‌హెచ్‌ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు!

సాధారణ జ్వరం అనుకుని నిర్లక్ష్యం చేయొద్దు. హెచ్‌ఎల్‌హెచ్‌ అనే అరుదైన వ్యాధి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసి కీలక అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. click here to read full news

——————————————————————————-


తెలుగు సిని పరిశ్రమపై సోనాలి బింద్రే ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమపై సోనాలి బింద్రే ప్రశంసలు కురిపించారు. హిందీ కంటే తెలుగు సినిమాలు ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో తెరకెక్కుతాయని, నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. click here to read full news

——————————————————————————-

అద్దెకు అమ్మాయిలు, అబ్బాయిలు

‘రెంట్ ఎ ఫ్రెండ్’ సేవలు యువతలో కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. కాఫీ డేట్ నుంచి ట్రిప్‌ల వరకు స్నేహితులను అద్దెకు తీసుకుంటుండగా, భద్రత, గోప్యతపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. click here to read full news

——————————————————————————-

కాళేశ్వరంపై చర్చకు రండి.. జ‌గ్గారెడ్డి సవాల్

కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో చర్చకు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రైతుల పేరుతో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని విమర్శించారు. click here to read full news