Jagga Reddy | కాళేశ్వరంపై చర్చకు రండి.. జ‌గ్గారెడ్డి సవాల్

Jagga Reddy | ఆంధ్రప్రభ, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ రైతులపై ప్రేమ తమకే ఉన్నట్టుగా మాట్లాడడం, ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయడం లేదన్నట్లు వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నప్పటికీ ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు హాజరు కావడం లేదని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీకి వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశంపై చర్చకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు.

కాళేశ్వరం అంశంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వానిదేనని జగ్గారెడ్డి అన్నారు. రైతుల పేరుతో రాజకీయ విమర్శలు చేయడం కంటే, అసెంబ్లీలో చర్చకు హాజరై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన సూచించారు.