తెలుగు సిని పరిశ్రమపై సోనాలి బింద్రే ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నటి సోనాలి బింద్రే తెలుగు సినీ పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ కంటే తెలుగు సినిమా పరిశ్రమ చాలా క్రమబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని అన్నారు. షూటింగక్ష ముందే కథ, స్క్రిప్ట్‌, షెడ్యూళ్లు అన్ని సిద్ధంగా ఉంటాయని అందే తెలుగు సినిమా పరిశ్రమ ప్రత్యేకత అని చెప్పుకోచ్చారు. తెలుగు సినిమాల్లో నిర్మాణంలో క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని, భారీ బడ్జెట్‌లతో పాటు సాంకేతిక ప్రమాణాలు కూడా అత్యున్నత స్థాయిలో ఉంటాయని సోనాలి అభిప్రాయపడ్డారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయడం వల్ల చిత్రీకరణ సాఫీగా సాగుతుందని తెలిపారు.

ముఖ్యంగా సెట్స్‌లో అందించే ఫుడ్‌ గురించి ప్రశంసలు కురింపించారు. పనివేళలు, సిబ్బంది పట్ల చూపే గౌరవం కూడా తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. తెలుగు చిత్రసీమలో పనిచేసిన అనుభవం తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని సోనాలి తెలిపారు.

కాగా సోనాలి బింద్రే తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు ఉంది. మురారి, మన్మథుడు, ఖడ్గం వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. బాలీవుడ్ లో సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించిన సోనాలి వరుస సినిమాలు వెబ్‌ సిరీస్ లతో బిజీగా మారారు. ఇక ఈ విషయంతో సోనాలి తెలుగు పరిశ్రమపై తనకున్న అభిమానాన్ని అనుభవాలను పంచుకున్నారు.