సింగరేణికి తాడిచర్ల-2 బ్లాక్ కేటాయింపుపై బీజేపీ సంబరాలు
రామకృష్ణాపూర్‌లో మోడీ, కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధన్సింగ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం ద్వారా ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, సుమారు 64,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేషన్ సాధ్యమవుతుందని తెలిపారు. దీనివల్ల దాదాపు 1200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సింగరేణి కార్మికుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నందుకు, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి వేణుగోపాల్, కట్ట ఈశ్వర చారి, పట్టణ ఉపాధ్యక్షులు సంతోష్ నాయక్, ముద్దసాని శ్రీనివాస్, మోటుకూరి దేవేందర్, మామిడాల రాజయ్య, గోపతిసత్యనారాయణ,ఉర్సు నర్సయ్య, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
