భీమవరంలో ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ షోరూమ్
భీమవరం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన రంగంలో తన ప్రస్థానాన్ని మరింత విస్తరిస్తూ పూర్‌పవర్ సంస్థ గోదావరి ప్రాంతంలో తన అత్యాధునిక షోరూమ్‌ను ప్రారంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గూనుపూడిలో ఏర్పాటు చేసిన ఎలైట్ ఎకో ఎనర్జీస్ షోరూమ్‌ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కొత్త కేంద్రం కేవలం ఉత్పత్తుల విక్రయ కేంద్రంగా కాకుండా, సుస్థిరమైన, నమ్మకమైన ఇంధన పరిష్కారాలను ప్రజలకు చేరువ చేసే కీలక వేదికగా నిలవనుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఇంధన వినియోగంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, పెరుగుతున్న విద్యుత్ అవసరాలు పూర్‌పవర్ విస్తరణకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో గోదావరి ప్రాంతంలో కొత్త షోరూమ్ ఏర్పాటు చేయడం సంస్థ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.
శ్రీ ఫణి, శ్రీ శ్రీరామ్ నాయకత్వంలో ఎలైట్ ఎకో ఎనర్జీస్.. పూర్‌పవర్ ఆధునిక శక్తి నిల్వ సాంకేతికతను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. గృహాలు, వాణిజ్య సంస్థలకు నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన శక్తి సామర్థ్యం, దీర్ఘకాలిక విశ్వసనీయతను అందించే పరిష్కారాలను ఈ కేంద్రం ద్వారా అందించనున్నారు.
ఈ షోరూమ్‌లో పూర్పవర్కు చెందిన అధునాతన శక్తి నిల్వ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం వినియోగదారులకు లభిస్తుంది. విద్యుత్ అంతరాయాల సమయంలో బ్యాకప్ అందించడంతో పాటు, స్మార్ట్ ఇంటిగ్రేషన్, భద్రత, పనితీరుకు ప్రాధాన్యతనిస్తూ ఈ వ్యవస్థలను రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సాంప్రదాయ విద్యుత్ బ్యాకప్ విధానాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వచ్ఛమైన ఇంధన వినియోగం వైపు ప్రజలను ప్రోత్సహించడమే పూర్‌పవర్ లక్ష్యమని తెలిపారు. ఆధునిక భారతీయ గృహాలు, వ్యాపార సంస్థల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ఇంధన పరిష్కారాలను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందన్నారు.
గోదావరి ప్రాంతం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎలైట్ ఎకో ఎనర్జీస్ షోరూమ్ ఈ ప్రాంత ప్రజలకు కొత్త తరం ఇంధన సాంకేతికతను చేరువ చేయనుంది. మరింత స్వచ్ఛమైన, స్థిరమైన ఇంధన భవిష్యత్తు దిశగా ఇది కీలక ముందడుగుగా నిలుస్తుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
