NEET Student Death | హాస్టల్ గదిలో ఉరివేసుకుని విగతజీవిగా..
NEET Student Death | హాస్టల్ గదిలో ఉరివేసుకుని విగతజీవిగా..
NEET Student Death | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: బిహార్ రాజధాని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని సమస్తీపూర్ జిల్లాకు చెందిన శ్రుతి కుమారిగా గుర్తించారు.
పాట్నాలోని పత్రకార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సచివాలయ కాలనీలోని రాధే కృష్ణ గర్ల్స్ హాస్టల్‌లో శ్రుతి ఉంటూ నీట్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఆమె గది నుంచి స్పందన లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. శ్రుతి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, చాటింగ్ వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రాథమికంగా పరీక్ష ఒత్తిడి, వ్యక్తిగత ఆందోళనల కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు తర్వాతే స్పష్టమవుతాయని అధికారులు చెబుతున్నారు.
