student | బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

student | బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి
student | సత్తెనపల్లి, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గేదెలు కాసేందుకు వెళ్లిన బూసి సుదర్శన్ (17) దాహం వేయడంతో సమీప బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఇంటర్ చదువుతున్న సుదర్శన్ అకస్మాత్తుగా మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
