COLLEGE | ఎయిడ్స్‌పై అవగాహన అవ‌స‌రం

COLLEGE | ఎయిడ్స్‌పై అవగాహన అవ‌స‌రం

జగ్గయ్యపేటలో ర్యాలీ
హాజ‌రైన మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘు రామ్

COLLEGE | ఆంధ్రప్రభ, జగ్గయ్యపేట : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్‌ (Hospital) జేఆర్సీ కాలేజ్ విద్యార్థుల సౌజన్యంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ పాల్గొన్నారు. హెచ్ఐవీ ఎయిడ్స్ పై ఉన్న అపోహలు, భయాలు, వాస్తవాలను విశదీకరిస్తూ సురక్షిత జీవన శైలి, నియమిత పరీక్షలు, సరైన చికిత్స యొక్క ప్రాముఖ్యతపై వైద్య అధికారులు సమగ్ర సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు వెంకటేశ్వర్లు, కానూరు కిషోర్, సుధాకర్, జేఆర్సీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.