6-killed-houthis-attack : హౌతీల దాడులతో హైటెన్షన్ Andhra Prabha Top News

6-killed-houthis-attack : హౌతీల దాడులతో హైటెన్షన్ Andhra Prabha Top News

  • ఆరుగురు దుర్మ‌ర‌ణం*
  • అమెరికా ప్రతిదాడి
  • చమురు ధరలకు సెగ
  • అక్క‌డ హౌతీలు.
  • ఈజిప్టు ఓడ పేల్చివేత‌
  • ఇక్క‌డ అమెరికా ద‌ళాలు
  • ప‌నామా నౌక ధ్వంసం
  • మ‌ధ్య ప్రాచ్యంలో ఉద్రిక్త‌త‌

(ఆంధ్ర‌ప్ర‌భ‌, దుబాయ్ )

ఐదు నెలలుగా కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశాలు క‌ష్ట‌త‌రం అవుతున్న నేపథ్యంలో, అమెరికా, యెమెన్ నౌకలపై వేర్వేరుగా ఇరాన్ అనుకూల హౌతీలు దాడులకు దిగాయి. తమ షరతులను అంగీకరించే వరకు హోర్ముజ్ జలసంధిని తెరిచేది లేద‌ని ఇరాన్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన కొన్ని గంట‌ల్లోనే హౌతీలు చల‌రేగిసోయారు.
ఎర్ర సముద్రంలో జూలై 20న సౌదీ అరేబియాపై నావికా దిగ్బంధనం విధిస్తామని యెమెన్ ప్ర‌క‌టించ‌గా బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో సైనిక సామగ్రిని తీసుకువెళ్తున్న సౌదీ నౌకపై హౌతీలు దాడి చేశౄరు. ఈ మేర‌కు హౌతీల అధికార వార్తా సంస్థ సబా నివేదించింది.
ఆ దాడిపై సౌదీ అరేబియా ఇంకా స్పందించ‌టేదు. కానీ మంగళవారం బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో ఒక సరుకు రవాణా నౌకపై హౌతీలు దాడి జ‌రిపార‌ని, న‌లుగురు వావికులు మరణించినట్లు యెమెన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈజిప్టు నౌక ‘తిహమాసపై హౌతీలు దాడి జ‌రిపంది. మ‌ధ్య ప్రాచ్యంలో యుద్ధం ఆరంభ‌మైన‌ప్ప‌ట్టి నుంచి హ‌\తీలు జ‌రిపిన పెద్ద దాడి ఇదేన‌ని అంత‌ర్జాతీయ మీడియా ప్ర‌క‌టించింది.
ఇరాన్ ఓడరేవుల్లో నావికా దిగ్బంధనాన్ని పదేపదే హెచ్చరించినా పట్టించుకోని పనామా సరుకు రవాణా నౌక పై MH-60 హెలికాప్టర్ రెండు హెల్ ఫైర్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఒమన్ గల్ఫ్‌లోకి ప్రయాణిస్తుండగా పాకిస్థాన్ సమీపంలో ఈ నౌకపై దాడి జరిగిందని సముద్రయాన వర్గాలు తెలిపాయి.

4-killed-houthis-attack : మ‌ళ్లీ చ‌మురు ధ‌ర స‌ల‌స‌ల‌

ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగేది లేద‌నే సంకేతాల‌తో మళ్లీ చమురు ధరలు పెరిగాయి, ప్రపంచ షేర్లు డ‌మాల్ మ‌న్నాయి. . బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.4% పెరిగి బ్యారెల్‌కు $88.91 వద్ద స్థిరపడగా, యూ.ఎస్. క్రూడ్ 1.3% పెరిగి $83.20కి చేరింది.