ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

  • బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్
  • కేతనకొండలో భారీగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షురాలు పయ్యావుల జయలక్ష్మి రాము దంపతుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ఫ్లోరిన్స్ నైటింగేల్ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు బుధవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు.

గ్రామ పుర వీధుల్లో జాతీయ నినాదాలతో దేశ భక్తితో ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రపంచానికి సూపర్ పవర్ దేశంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామమోహనరావు (గాంధీ), బీజేపీ నేతలు రేగళ్ల రఘునాథరెడ్డి, మారాసు కృష్ణ మోహన్, చిగురుపాటి లక్ష్మి, ఆలకుంట చిట్టి, తుమ్మల శ్రీ కుమార్, గోవిందు, సురేష్, ప్రసాద్, కొల్లి నాగేశ్వరరావు, కృష్ణ కుమారి, సత్యవతి, యుగంధర్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.