Narsampet | ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో
Narsampet | ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో
Narsampet | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట (Narsampet) ఆర్టీసీ డిపోలో ప్రమాదాలు ఏర్పడితే చేపట్టాల్సిన చర్యలపై అగ్నిమాపక సిబ్బంది డెమో (Firefighter demo) ప్రదర్శించారు. డిపోలో కానీ, పెట్రోల్ బంక్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిపో ఉద్యోగులకు డెమో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ, నర్సంపేట ఫైర్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అయూబ్, డిపో సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ వీరారెడ్డి, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.
