Collector | పూలే బాటలో నడుద్దాం..

Collector | పూలే బాటలో నడుద్దాం..

మహనీయునికి నివాళి
అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్

అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిబా పూలే చూపిన బాటలో ప్రతీ ఒక్కరు నడవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ (District Collector) ఆనంద్ అన్నారు. పూలే 135వ వర్ధంతి సందర్భంగా అనంతపురంలోని జిల్లా పరిషత్, ప్రాంగణంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సమాజ హితం కోసం ఆనాడు చేసిన పనులు శాశ్వతంగా గుర్తింపు పొందుతాయన్నారు.