మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న వసుంధర దేవి

మోపిదేవి (ఆంధ్రప్రభ): మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాగ పుట్టలో పాలు పోసి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు వసుంధర దేవిని ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావి రత్నగిరి, జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.