అంత్యక్రియలకు సర్పంచ్ ఆర్థిక సాయం

అంత్యక్రియలకు సర్పంచ్ ఆర్థిక సాయం

మర్రిగూడ, ఆంధ్రప్రభ: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తానని మరోసారి నిరూపించారు రాంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లపంగి నర్సింహా. గ్రామానికి చెందిన కావటి రాములమ్మ (80) బుధవారం మృతి చెందగా, విషయం తెలిసిన వెంటనే సర్పంచ్ నర్సింహా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సహాయంగా రూ.5 వేల నగదు అందజేశారు.

పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సర్పంచ్, కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఒక సామాన్య కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఆయన చూపిన స్పందనను గ్రామస్థులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కారంగు నర్సింహా, భీమనగొని యాదయ్య, బండి హనుమంతు, వార్డు సభ్యులు లపంగి మహేందర్, సిరుపంగి శ్రీనివాస్, పగిళ్ల వంశీ, కావటి యాదయ్య, కావటి శ్రీను, బేత జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply