Nandyal | నీటిలో పసికందు మృతదేహం..

Nandyal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ సమీపంలోని కాసింతల బ్రిడ్జి వద్ద నీటిలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం లభ్యమవడం స్థానికులను కలచివేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు నవజాత శిశువును నీటిలో పడేసి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నీటిలో పసికందు మృతదేహం చుట్టూ కుక్కలు తిరుగుతుండటాన్ని గమనించిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శిశువు ఎలా అక్కడికి చేరింది? ఎవరు వదిలి వెళ్లారు? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిని ఇలా వదిలేయకుండా అనాథాశ్రమానికి అప్పగించి ఉంటే ప్రాణాలతో ఉండేదని, ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.