Nalgonda | హోల్డింగ్ రూమ్ ఏర్పాటు…

Nalgonda | హోల్డింగ్ రూమ్ ఏర్పాటు…

Nalgonda | చిట్యాల, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ పై నల్గొండ జిల్లా(Nalgonda District) పోలీస్ దృష్టి సారిచిందని, అందుకోసం వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కలగటం కోసం వినూత్న కార్యక్రమానికి పూనుకున్నామని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharat Chandra Pawar) అన్నారు.

ఈ రోజు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద జాతీయ రహదారి 65 పై ప్రమాదాల నివారణ రోడ్డు పై వెళ్లే వాహన చోదకులకు కనిపించే విధంగా ఆక్సిడెంట్ ఐన వాహనాన్నిఉంచేందుకు హోల్డింగ్ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఈ హోల్డింగ్ రూమ్‌(Holding Room)ని డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ నాగరాజు(DSP Sivaram Reddy, CI Nagaraju), రవికుమార్ లతో కలిసి ఆయన ప్రారంభించారు.

మీ వాహనం వేగంగా వెళుతుంది కానీ మీ జీవితం ఆగిపోతుంది అనే ఆలోచించదగ్గ కోటేషన్ తో హోల్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ హోల్డింగ్ వన్ కిలోమీటర్ నుంచి కనిపించే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అత్యధికంగా ప్రమాదాలు జరగడానికి అతివేగంతో పాటు హెల్మెట్‌(helmet) పెట్టుకోక‌పోవ‌డ‌మేనని, ప్రమాదాల నివారణకు చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే జీవితాలను కాపాడుకోవచ్చని అందుకోసం వాహ‌న‌దారులను ఎప్పటికప్పుడు హెచ్చరించే విధంగా ఈ సైనింగ్ బోర్డులో ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ అన్నారు.