Key Issues | నిర్మలా సీతారామన్‌తో భట్టి విక్రమార్క భేటీ

Key Issues | నిర్మలా సీతారామన్‌తో భట్టి విక్రమార్క భేటీ

Key Issues | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

ఎస్‌ఏఎస్‌సీఐ కింద తెలంగాణకు అదనంగా రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలని భట్టి విక్రమార్క కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ఆమెకు వివరించారు.

మానవ వనరుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి భట్టి వివరించారు. అలాగే డీఈఏ ఆమోదించిన ప్రాజెక్టులకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

Leave a Reply