Mungodu | సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకం

Mungodu | సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకం

Mungodu | మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామీణ సంస్కృతి,సంప్రదాయాలు కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం మహేష్ పేర్కొన్నారు. ఈ రోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుండ్లోరిగూడెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా గ్రామంలోని మహిళలకు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొల్లం మహేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి, పాల్గొన్న వారికి కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్లు, బిజెపి వార్డు మెంబర్లు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిని బొల్లం రాజేశ్వరి గెలుచుకున్నారు. బొల్లం మహేష్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఐక్యత పెంపొందిస్తాయని అన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు జంగిలి నాగరాజు,పల్లెబోయిన దుర్గా శ్రీ సైదులు,బి జె పి గ్రామశాఖ అధ్యక్షుడు పల్లెబోయిన సురేష్, బొల్లం వెంకన్న, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply