Mulugu : నిర్మాణ‌ పనులపై సమీక్ష…

Mulugu : నిర్మాణ‌ పనులపై సమీక్ష…

  • అధికారులకు దిశ నిర్దేశం..

ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం హరిత హోటల్ లో సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 నిర్వహణపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha), రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క(Minister Danasari Anasuya Seethakka), ఎస్సి, ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar), మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్(Porika Balaram Nayak) ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

దీనిలో ప్రధానంగా మేడారంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై చర్చించారు. ఆలయ ప్రాంగణంలో గద్దెల నిర్మాణాలు, చుట్టూ ప్రహారీ గోడ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెల నిర్మాణ‌ పనులు, రహదారుల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జాతర సమయం దగ్గరపడుతున్న క్రమంలో పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.