Ditwah Cyclone | అవసరమైతే తప్పా..
Ditwah Cyclone | అవసరమైతే తప్పా..
Ditwah Cyclone, సూర్యాపేట, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని, చలి గాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా ప్రజలను, రైతులను అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ (SP) నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని, ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ అంతా అప్రమత్తంగా ఉన్నారని, సెలవులు రద్దుచేసి విధుల్లో నియమించడం జరిగిందని తెలిపారు. రైతులు వరి ధాన్యం తడవకుండా పట్టాలతో కప్పివేసుకోవాలని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100, సూర్యాపేట పోలీస్ (Police) కంట్రోల్ రూమ్ కు 8712686026 ఫోన్ చేయాలని సూచించారు.
