భవానీపురంలో మొదలైన కొత్త దిశ ఏంటి..?

భవానీపురంలో మొదలైన కొత్త దిశ ఏంటి..?

భవానీపురం, ఆంధ్రప్రభ : పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.

ఫేజ్-3 కింద ఎన్టీఆర్ జిల్లాలోని భవానీపురం ఇండస్ట్రియల్ పార్క్‌లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, స్థానిక డివిజన్ అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య, కామ దేవరాజు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన ఆధునిక మౌలిక వసతులు కల్పించడం ద్వారా స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని నాయకులు పేర్కొన్నారు.

ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుతో ఒకే ప్రాంగణంలో అనేక చిన్న పరిశ్రమలు కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. దీంతో పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు పారిశ్రామికవేత్తలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, పారిశ్రామిక పార్కుల ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

Leave a Reply