mrunal | లవ్ స్టోరీ బయటపెట్టిన మృణాల్ ఠాగూర్.. ప్రేమలో ఫెయిల్ అయ్యిందా?

mrunal | లవ్ స్టోరీ బయటపెట్టిన మృణాల్ ఠాగూర్.. ప్రేమలో ఫెయిల్ అయ్యిందా?మృణాల్ ఠాగూర్ లవ్ స్టోరీ రివీల్.. బ్రేకప్ వెనుక అసలు కారణం ఇదేనా?

mrunal | లవ్ స్టోరీ బయటపెట్టిన మృణాల్ ఠాగూర్.. ప్రేమలో ఫెయిల్ అయ్యిందా?మృణాల్ ఠాగూర్ ప్రేమ వ్యవహారం ఎందుకు వైరల్ అయ్యింది?
మాజీ ప్రియుడితో బ్రేకప్ పై మృణాల్ సంచలన వ్యాఖ్యలు
యాక్టింగ్ నచ్చలేదని విడిపోయానన్న మృణాల్
ఫెయిల్ లవ్ గురించి మృణాల్ ఓపెన్ గా ఏమంది?
ధనుష్ తో రిలేషన్ పై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ

mrunal | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మృణాల్ ఠాగూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు ఈమధ్య బాగా వినిపిస్తుంది. ఈ బాలీవుడ్ భామ.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. సక్సెస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. అయితే.. ఈ అమ్మడు ప్రేమలో పడిందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతుందని.. న్యూస్ వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో అయితే.. ఒకటే రచ్చ.. దేని గురించే చర్చ. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తన లవ్ స్టోరీని బయటపెట్టింది. ఇంతకీ.. మృణాల్ లవ్ స్టోరీ గురించి ఏం చెప్పింది..?

mrunal
mrunal

మృణాల్ ఠాగూర్ నటించిన లేటెస్ట్ మూవీ దో దీవానే శహర్ మే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన లవ్ స్టోరీని బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. తనకు దూకుడు ఎక్కువ అని.. నాతో ఉండలేనని చెప్పి బ్రేకప్ చెప్పేసాడని మాజీ ప్రేమికుడు గురించి చెప్పింది. అంతే కాకుండా.. తనకు యాక్టింగ్ చేయడం కూడా నచ్చలేదని.. విడిపోవడానికి ఇది కూడా ఓ కారణమని బయటపెట్టింది. అయితే.. బ్రేకప్ చెప్పినందుకు నేనేం బాధపడలేదని.. తన మనస్తత్వం గురించి తెలిసి జాలిపడ్డానని చెప్పింది మృణాల్ ఠాగూర్.

mrunal
mrunal

అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తితో కొనసాగడం కూడా నాకు కష్టమే. అందుకే విడియానని.. అలాంటి వాళ్లను పెళ్లి చేసుకుంటే.. పిల్లలు కూడా అవే ఆలోచనలతో పెరుగుతారు. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే.. అతను దూరం వెళ్లినప్పటికీ.. నేను కూడా దూరంగా జరిగాను అంటూ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని బయటపెట్టింది. అయితే.. ఇప్పుడు ధనుష్ తో లవ్ లో ఉన్నట్టు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ధనుష్ గురించి అడిగితే.. కేవలం స్నేహితులం మాత్రమే అంటుంది. అయితే.. మృణాల్ పాత లవ్ స్టోరీ గురించి చెప్పింది.. మరి.. కొత్త లవ్ స్టోరీ గురించి ఎప్పుడు చెబుతుందో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

click here to read Nagarjuna | మరో సినిమాకి ఓకే చెప్పారా..?

click here for more

Leave a Reply