Job Mela 2026 : 29న భారీ జాబ్ మేళా Andhra Prabha News

Job Mela 2026 : 29న భారీ జాబ్ మేళా Andhra Prabha News
- తిరుపతికి 17 కంపెనీలు రాక
- 800 పోస్టుల భర్తీకి సన్నహాలు
Job Mela 2026 : తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న తిరుపతిలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా పోస్టర్లను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ సిటీ, మేనకూరు సెజ్, ఈఎంసీ క్లస్టర్, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు చెందిన 17 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొని 800కు పైగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళా ఈ నెల 29వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఎస్‌వీసీసీ డిగ్రీ కళాశాల లో జరగనుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ మే 28 కాగా, స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. ఆధార్ ఓటీపీ ద్వారా నమోదు చేసుకుని, అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 81435 76866, 99888 53335ను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం, నగర జనసేన అధ్యక్షుడు రాజా రెడ్డి, కొండ రాజమోహన్, నీలాద్రి, ఆర్కాట్ కృష్ణ ప్రసాద్, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, బాలిశెట్టి కిషోర్, లోకేష్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
