తమిళనాడు తీర్పు.. ప్రజాస్వామ్య విలువలకు పట్టం…

తమిళనాడు తీర్పు.. ప్రజాస్వామ్య విలువలకు పట్టం…

విభజన రాజకీయాలకు దక్షిణాది ప్రజల గట్టి సందేశం…
రాజ్యాంగ పరిరక్షణలో ప్రజలే తుది నిర్ణేతలు…
విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు వల్లూరు భార్గవ్..

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో లౌకిక, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌చార్జ్ భర్గవ్ వల్లూరు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ ప్రజలు తమ తీర్పు ద్వారా విభజన రాజకీయాలను తిరస్కరించినట్లే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మతం, ద్వేషం, ప్రచార రాజకీయాలను ప్రోత్సహించే శక్తులను తిరస్కరిస్తారని అన్నారు.

దక్షిణ భారత ప్రజలు సామాజిక విభజనకు చేసే ప్రయత్నాలను స్పష్టంగా గుర్తించి ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ రాజకీయాలకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఐక్యత, సామరస్యాన్ని ప్రజలు ఎప్పుడూ కాపాడుతారన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన భర్గవ్ వల్లూరు, ఇది కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదని, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వరం, సమగ్ర పాలనకు లభించిన గెలుపుగా అభివర్ణించారు. ప్రజల తీర్పును వక్రీకరించే ప్రయత్నాలు ఎంత జరిగినా ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ప్రజలదేనని, ద్వేష రాజకీయాలపై రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విజయం సాధిస్తాయని ఆయన స్పష్టం చేశారు.