యాప్ ద్వారా యూరియా విక్రయాలు ప్రారంభించాం..

మేకావారిపాలెం పీఏసీఎస్ చైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ

చల్లపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : యాప్ ద్వారా యూరియా విక్రయాలు ప్రారంభించినట్లు మేకావారిపాలెం పీఏసీఎస్ చైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం పాగోలు శివారు మేకావారిపాలెం పీఏసీఎస్ వద్ధ రైతులకు యూరియా విక్రయాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి, ప్రయోగాత్మకంగా చేపట్టిన యాప్ ద్వారా ఎకరాకు 90కిలోల చొప్పున యూరియా అందిస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ సహకరించి ప్రతి ఒక్కరూ యాప్ ద్వారా యూరియా పొందాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ కోరుకొండ శ్రీనివాసరావు, పర్సన్లు చిటికినేని శ్రీనివాసరావు, వక్కలగడ్డ శివరామకృష్ణ, వీఏఏ కొలుసు శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ పెనుమూడి శ్రీనివాసరావు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.