చిన్నారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన నివాళి

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం వంగాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు గూటం అకిరానందన్ (14), నూనె మనోజ్ కుమార్ (13) ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయిన చిన్నారుల మృతదేహలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం అత్యంత బాధాకరమని శ్రీహరి అన్నారు.
ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారుల ఇలా అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. శోకసంద్రంలో మునిగిన చిన్నారుల తల్లిండ్రులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే వెంట చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, స్థానిక సర్పంచ్ భూక్యా మేనకా సుధాకర్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
