వారంలోపు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి
బాసర (ఆంధ్రప్రభ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వారంలోపు పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం బాసర గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి పురోగతిని సమీక్షించారు.
మండల కేంద్రంలో కేవలం 11 శాతం మాత్రమే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతో వారంలోపు ప్రక్రియను పూర్తి చేయాలని తహసీల్దార్ పవనచంద్రను ఆదేశించారు. ఎస్ఐఆర్ ఫారమ్‌లలో ఎలాంటి తప్పుడు సమాచారం నమోదు చేయరాదని సూచించారు. నిరక్షరాస్యులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, బీఎల్వోలు కలిసి ఫారమ్‌లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పవనచంద్ర, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఎంపీఓ గంగాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అభిమన్యు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
