నిరుపేదల సంక్షేమమే నా లక్ష్యం..
18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహమ్మద్ జబ్బార్ పోటీ
-గెలిచిన వెంటనే హామీలను అమలు చేస్తాను.
-ఎమ్మెల్సీ పోచంపల్లి సహకారంతో 200 కుట్టు మిషన్లు ఇప్పిస్తాను
-డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను
-అవినీతి లేకుండా సహాయం అందేలా చూస్తాను
-నాకు ఆశీర్వాదం ఇవ్వండి..వార్డు అభివృద్ధి చేసి చూపిస్తాను
-18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహమ్మద్ జబ్బార్ పోటీ
స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: యువకుడైనా అనుభవం ఉన్న నాయకుడిలా ఆలోచించే వ్యక్తి మహ మ్మద్ జబ్బార్. మంచి సేవా గుణం కలవాడు అందరితో కలిసి మెలిసి ఉండే మనసున్న మనిషి. పేదోడికి కష్టం వస్తే దూరంగా నిలబడడు… దగ్గరికి వెళ్లి హత్తుకొని పరిష్కారం చూపే నాయకుడు. సమస్య వచ్చి నప్పుడు ప్రశ్నించడంలో ధైర్యం, పరిష్కారం చూపడంలో పట్టుదల ఉన్న వ్యక్తి. మాటలకే కాదు…పనులకే గుర్తింపు తెచ్చుకున్న యువనేత అతను. స్టేషన్ ఘన్ పూర్ పట్టణ మున్సిపాలిటీలోని 18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ జబ్బార్ ఎన్నికల బరిలోకి నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సహకా రంతో వార్డులోని నిరుపేద మహిళ లకు 200 కుట్టు మిషన్లు అందిస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన వెంటనే వాటి మంజూరుకు పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కల్యాణి లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ అవినీతి లేకుండా సహాయం అందేలా కృషి చేస్తా నన్నారు. పెండింగ్‌లో ఉన్న పథకాలు, ఇప్పటివరకు అర్హులకు అందని పథకాలు అందేలా ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి రాకపోతే వెంటనే ఇప్పించే బాధ్యత నాదేనని చెప్పారు. వార్డులో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు చేపడతానని జబ్బార్ తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తానన్నారు.
-జబ్బార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరింత సేవా కార్యక్రమాలు చేస్తాను:
జబ్బార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు జబ్బార్ గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను సన్మానించడంతో పాటు గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎస్‌ఎస్‌సీ విద్యా ర్థులకు పరీక్ష సామగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే 18వ వార్డు లో 10వ తరగతి చదివిన విద్యార్థుల్లో సృజనాత్మకతకు 10/10 మార్కులు సాధించిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తానని హామీ ఇచ్చా రు. ఫౌండేషన్ ద్వారా వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారి అవస రాలకు అనుగుణంగా సహాయం అందిస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలే తన అజెండా అని..సేవాభావంతో వార్డు అభివృద్ధికి అంకిత మవుతానని మహమ్మద్ జబ్బార్ స్పష్టం చేశారు.
