బీజేపీ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ సభ్యుడిగా ప్రవీణ్ రెడ్డి నియామకం

వికారాబాద్ (ఆంధ్రప్రభ): భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ రాష్ట్ర కమిటీలో ప్రవీణ్ రెడ్డిని రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ.. 2028–2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, జట్టు సభ్యులతో సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్, సహ కన్వీనర్ నిరంజన్ దేశాయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నియామకంతో ప్రవీణ్ రెడ్డి దేవాలయాల పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాశ్, సహ కన్వీనర్ నిరంజన్ దేశాయ్‌లకు ప్రవీణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవతో పాటు ధార్మిక కార్యక్రమాల్లోనూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.