రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ధర్నాలు.

రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ధర్నాలు.

పాయకాపురం, ఆంధ్రప్రభ : రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ధర్నాలని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యానించారు. అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమా పాల్గొని రెండు ఏళ్ల కూటమి పాలన వెన్నుపోటు అనే వైసీపీ నిర్వహించిన కార్యక్రమంపై ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర రాజధాని లేకుండా చేసి, రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే సంక్షేమం విషయంలో 60లక్షలు పింఛన్దారులు ఉంటే 40లక్షలు కుదించిన విషయాన్ని ప్రస్తావించారు. పించన్ పెంచుతామని లబ్ధిదారులకు చెప్పి ఐదు సంవత్సరాలు కాలయాపన చేసిన విషయాన్ని విన్నవించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదని, అప్పటి మంత్రులు, అధికారులపై కుంభకోణాలు సిట్, సిబిఐ అధికారులు బయటకు తీసుకోస్తున్నారని అన్నారు. ప్రజలు వైసీపీ పాలనపై విసుగుచెంది,కూటమి పాలనకు అధికారం ఇచ్చారని అన్నారు. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కూటమి ఇచ్చిన హామీ ప్రకారం పించన్ పెంచి ప్రతి నెల క్రమంతప్పకుండా ఇస్తున్నారని అన్నారు.

తల్లికి వందనం పేరిట ఒకే కుటుంబంలో ఏడుగురుకి కూడా తల్లి ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల మందికి ఉచిత గ్యాస్ బండలు,అన్నా కాంటీన్లు పురుద్దరణ, డ్వాక్రా సంఘాలకు పది లక్షలు వరకు ఋణ సదుపాయాలు. యూత్ మెగా డి.ఎస్. సి, రహదారులు నిర్మాణం.స్కూల్ ప్రారంభం అయిన రోజునే బుక్స్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే చెల్లుతుందని అన్నారు. ఒక రాజకీయ లబ్ది కోసమే వైసీపీ నిరసనలు ల్, ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని బొండా ఉమా పేర్కొన్నారు.