ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్

వేములవాడ, ఆంధ్రప్రభ: ఎస్‌ఐఆర్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల లో ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక్క బిఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా చూడాలని ఒక్క దొంగ ఓటు కూడా ఉండకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఎస్ఐ ఆర్ ప్రక్రియ లో చాల అవకతవకలు జరిగాయని తెలుస్తుందన్నారు.

వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తొలగించాలని బీహార్లో 65 లక్షల కోట్లు తొలగించారని తమిళనాడులోని ఒక్క స్టాలిన్ నియోజకవర్గం లోని 80 వేల ఓట్లు తొలగించారన్నారు. వెస్ట్ బెంగాల్లో 25 లక్షల మంది ప్రజలు తమ ఓటు హక్కును తీసివేసారని న్యాయస్థానాలకు వెళ్లారన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply