ఆలయాలకు రక్షణ కరువు

ఆలయాలకు రక్షణ కరువు

దేవతా మూర్తులపై దాడులు జరగడం హేయమైన చర్య

నిజామాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పాలనలో ఆలయాలకు రక్షణ కరు వైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇటీవల ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా హిందూ ఆలయాలపై, హిందూ దేవతా మూర్తులపై దాడులు జరగడం హేయమైన చర్య అని అర్బన్ ఎమ్మె ల్యే మండిపడ్డారు. ఒక్క సారి కాషాయ దళం రెచ్చి పోతే జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారితో పాటు లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాల యం లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడారు. నగరంలోనిగోపాల్ బాగ్ లో పురాతన శివాలయం పై గత మూడు రోజుల క్రితం జరిగిన ఈ విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీ సులు కనీసం నిందితుల ను పట్టుకోవడంలో వైఫ ల్యం చెందారని అన్నారు. ఈ 80 ఎకరాల గోశాల స్థలంలో కొందరు కబ్జాలకు కూడా పాల్పడ్డారని వెంట నే కలెక్టర్, రెవిన్యూ సిబ్బం ది స్పందించి ఈ కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ శివాల యం పక్కనే గల గోశాల లో 150 ఆవులు ఉన్నా యని, దేవతా విగ్రహాలకే భద్రత లేని ఈ పరిస్థితుల్లో గోమాతలకు ఏదైనా ప్రమా దం జరిగితే ఎవరు బాధ్య త వహిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఉమ్మ డి నిజామాబాద్ జిల్లాలో అనేక హిందూ ఆలయాల పై, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెట్రేగిపోతు న్నా యని విమర్శించారు. అలాగే హిందూ అమ్మాయి లపై లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణమే చర్య లు తీసుకోవాలని డిమాం డ్ చేశారు.

ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి , మిగతా మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమది సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వారు అంటూ ఉంటారని సెక్యు లర్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సెక్యులర్ పార్టీ అంటే బిజెపి పార్టీ అని, మా పార్టి కేవలం ఒక హిందువులే కాకుండా దేశంలో ఉన్న అన్ని మత స్తులతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో దేశవ్యా ప్తంగా ముందుకు వెళ్తుంద న్నారు.ఇలాంటి సంఘ టనలు భవిష్యత్తులో పున రావృతం కాకుండా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే కోరారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply